వ్యక్తిపై దాడి కేసులో ఐదుగురు రిమాండ్..

by Kodari Anjali |

వ్యక్తిపై దాడి కేసులో ఐదుగురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

వ్యక్తిపై దాడి కేసులో ఐదుగురు రిమాండ్..
X

దిశ, గన్నేరువరం: మండలంలోని గునుకుల కొండాపూర్‌లో గత నెల 19వ తేదీన మ్యారేజ్ భరత్‌లో ఇల్లంతకుంట గ్రామానికి చెందిన బోలు మల్ల అజయ్‌పైన గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి రాకేష్, గుండ అజయ్, లింగంపల్లి శివ, దొమ్మటి అజయ్, గుండ్లపల్లి కు చెందిన కళ్లెం సాయి కుమారి లు దాడి చేశారు. కాగా ఫిర్యాదు మేరకు అదే రోజు కేసు నమోదు చేసి గురువారం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా.. వారికి 14 రోజుల రిమాండ్ విధించగా వారిని జైలుకు తరలించినట్లు ఎస్సై జి నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story