- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారిన కార్మిక శాఖ పేరు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

- ఒకే గొడుగు కిందకు ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు!
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుత కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ పేరును "డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్" (శక్తి)గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బాధ్యతలను నూతనంగా ఏర్పాటైన శక్తి శాఖకు బదిలీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఇకపై యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి రానున్నాయి. రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలలను కూడా ఈ స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురానున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్, స్కిల్స్ యూనివర్సిటీల్లో కొనసాగుతున్న ప్రవేశాల ప్రక్రియకు ఈ నూతన సంస్కరణల వల్ల ఎలాంటి ఆటంకం కలగదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
చర్లపల్లి జైలులో ఐటీఐ..
ఖైదీలకు వృత్తి నైపుణ్యాలు నేర్పి, వారు సమాజంలోకి తిరిగి వచ్చిన తర్వాత స్వయం ఉపాధి పొందేలా చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శక్తి శాఖ ఆధ్వర్యంలో చర్లపల్లి సెంట్రల్ జైలు ఆవరణలో కొత్త ఐటీఐని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి దాసరి హరిచందన ఉత్తర్వులు జారీ చేశారు.






