హోటల్ గ్రాండ్ లాడ్జిలో యువతి అనుమానాస్పద మృతి..

by Taduka Kalyani |

లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌లో యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

హోటల్ గ్రాండ్ లాడ్జిలో యువతి అనుమానాస్పద మృతి..
X

దిశ, కార్వాన్: లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌లో యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఇన్స్పెక్టర్ వెంకట రాములు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాబౌలి చార్మినార్ ప్రాంతానికి చెందిన నామాల నాయుడు కూతురు రేణుక (26) గత ఏడేళ్లుగా పబ్ డాన్సర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా ప్రస్తుతం బొల్లారంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో గోల్కొండ ప్రాంతంలో డైరీ ఫామ్, రియల్ ఎస్టేట్ నడిపే ఫారుఖ్‌తో రేణుకకు పబ్బులో పరిచయం ఏర్పడింది. గత ఆరు నెలలుగా వీరిద్దరూ లంగర్‌హౌస్ ఆంధ్ర ఫ్లోర్ మిల్ సమీపంలోని గ్రాండ్ హోటల్‌కు వస్తూ వెళ్తున్నారు. గురువారం రాత్రి కూడా ఇద్దరూ కలిసి హోటల్ గదికి వచ్చారు. అనంతరం సమీపంలోని క్లాసిక్ గార్డెన్‌లో ఫంక్షన్ ఉందని చెప్పి ఫారుఖ్ బయటకు వెళ్లాడు. తిరిగి వేకువజామున వచ్చేసరికి రేణుక ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించిందని ఫారుఖ్ పోలీసులకు సమాచారం అందించాడు.

హత్యనా..? ఆత్మహత్యనా..?

ఘటనా స్థలంలో మద్యం బాటిల్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఫారుఖ్ బయటకు వెళ్లిన తర్వాత, రేణుక కూకట్‌పల్లికి చెందిన తన స్నేహితురాలు సత్యతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. తన ఫోన్ పాడైందని రేణుక చెప్పగా, సత్య సోదరుడు రిపేర్ చేయిస్తానని ధైర్యం చెప్పినట్లు సమాచారం. అయితే, ఆ తర్వాత రేణుక తాను చనిపోతున్నానంటూ సత్యకు వీడియో కాల్ చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు లంగర్‌హౌస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇది హత్యనా..? లేక ఆత్మహత్యనా..? అనే కోణంలో విచారణ జరుపుతూ, ఫారుఖ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

నాకు కొంత మంది పై అనుమానాలు ఉన్నాయి.. సోనియా బాధితురాలి సోదరీ

చనిపోయే 10 నిమిషాల ముందు రేణుక నాతో నవ్వుకుంటూ మాట్లాడింది. తన ఫ్రెండ్ అయేషా, ప్రియకు ఫోన్ చేయమని చెప్పింది. నాకు తర్వాత ప్రియ ఫోన్ చేసి రేణుక చనిపోయినట్లు తెలిపింది. నాకు కొంత మంది పై అనుమానాలు ఉన్నాయి. వారిపై ఫిర్యాదు చేస్తానని తెలిపింది.

రేణుక ది ఆత్మహత్య కాదు హత్యే అంటున్న హిందూ సంఘాలు...

రేణుక ది ఆత్మహత్య కాదని ముమ్మాటికి హత్యే అని హిందూ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నాయి. రేణుక హత్య విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. రేణుక హత్య విషయం తెలుసుకున్న కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాలకు చెందిన పలు హిందూ సంఘాల ప్రతినిధులు శుక్రవారం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని హత్య జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల ప్రతినిధులు బంగారి ప్రకాష్, అల్వాల ఇంద్రసేనారెడ్డిలు మాట్లాడుతూ... అమాయక హిందూ మహిళలను లవ్ జిహాద్ పేరుతో లోబర్చుకొని హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. రేణుక హత్య విషయంలో పోలీసులు ఏ రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story