- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
30శాతం మైలేజ్ తగ్గితే 30శాతం ధర తగ్గాలి కదా.. E20 పెట్రోల్ పై కేజ్రీవాల్ ప్రశ్నల వర్షం
E20 పెట్రోల్ (20శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) సామర్థ్యం, వాహనాలపై దాని ప్రభావం గురించి ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ పంపిణీని కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: E20 పెట్రోల్ (20శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) సామర్థ్యం, వాహనాలపై దాని ప్రభావం గురించి ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ పంపిణీని కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సుప్రీకోర్టు తీర్పు చూపిస్తూ కేంద్రం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని అన్నారు. 20 శాతం ఇథనాల్ పెట్రోల్ కేవలం ప్రయోగమేనని ఫలితాలను బట్టి భవిష్యత్ చర్యలు ఆధారపడి ఉంటాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిందని అన్నారు. కానీ ప్రజలను తప్పుదోవ పట్టించి ఇథనాల్ 20 పెట్రోల్ సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. ఇథనాల్ పెట్రోల్ పై ఎలాంటి ప్రయోగాలు చేశారని ప్రశ్నించారు.
ప్రయోగం చేయడం అంటే వంద, యాభై, వెయ్యి ఇలా కొన్నివాహనాలపై ప్రయోగించి ఫలితాల ఆధారంగా దానిని దేశవ్యాప్తంగా అమలు చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారని చెప్పారు. ప్రయోగం చేస్తున్నామని చెబుతూ 140 కోట్ల జనాభాకు ఇథనాల్ పెట్రోల్ ను తప్పనిసరి చేశారంటూ మండిపడ్డారు. వినియోగదారుల మైలేజీ తగ్గిపోవడం, వాహనాలు పాడవ్వడం లాంటి సమస్యలు వస్తున్నాయని వారికి నష్టపరిహారం చెల్లిస్తారా అంటూ ప్రశ్నించారు. మీ సొంత నిపుణుడు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాగ్ మైలేజీలో30శాతం తగ్గిందని చెబుతున్నారని ఆయన ప్రకటనను వినాలని సూచించారు. మైలేజీ 30 శాతం తగ్గితే పెట్రోల్ ధర రూ.30 శాతం తగ్గించాలి కదా అని ప్రశ్నించారు.






