- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊరుకొండ, మిడ్జిల్ మండలాల్లో సీఎం పర్యటన వివరాలు
తనకు రాజకీయ జన్మను ఇచ్చిన ఊరుకొండ, మిడ్జిల్ మండలాలలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్‌ను అధికారులు శుక్రవారం విడుదల చేశారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : తనకు రాజకీయ జన్మను ఇచ్చిన ఊరుకొండ, మిడ్జిల్ మండలాలలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్‌ను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలిక్యాప్టర్‌లో నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ పేటకు చేరుకుంటారు. అక్కడ ప్రసిద్ధిగాంచిన ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడే తాను మిడ్జిల్ జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు తన గెలుపు కోసం కృషిచేసిన వారితో పాటు, ముఖ్య నాయకుల తో భేటీ అవుతారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా వెలిజాల మీదుగా మధ్యాహ్నం 2. గంటల 45 నిమిషాలకు మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలానికి చేరుకుంటారు. అక్కడ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ గోపాల్ రెడ్డి విగ్రహాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మూడు గంటలకు మిడ్జిల్, ఊరుకొండ పేట మండలాలకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆయన హెలిప్యాడ్ సమీపంలో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. నాలుగున్నర గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరుతారు.






