- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాధాగాయత్రి కేసులో మరో హైడ్రామా.. మళ్లీ విచారణాధికారి మార్పు
రాధాగాయత్రి కేసులో మరో హైడ్రామా చోటు చేసుకుంది. మరోసారి విచారణ అధికారిని మార్చారు. ప్రస్తుతం విచారణాధికారిగా ఉన్న సంపూర్ణానంద గైరోలాను తప్పించి డిప్యూటీ ఎస్పీ జేసీ పంత్‌ను నియమించారు.

దిశ, వెబ్ డెస్క్: రాధాగాయత్రి కేసులో మరో హైడ్రామా చోటు చేసుకుంది. మరోసారి విచారణ అధికారిని మార్చారు. ప్రస్తుతం విచారణాధికారిగా ఉన్న సంపూర్ణానంద గైరోలాను తప్పించి డిప్యూటీ ఎస్పీ జేసీ పంత్‌ను నియమించారు. ఈ కేసులో విచారణాధికారిని మార్చడం ఇది రెండోసారి కావడం అనుమానాలకు దారితీస్తోంది. మొదట ఈ కేసును ముస్సోరి ఎస్‌హెచ్‌వో దేవేంద్ర చౌహాన్ విచారించారు. ఆయన విచారణ తీరుపై రాధాగాయత్రి తండ్రి సుధాకర్ ఉత్తరాఖండ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం సంపూర్ణానంద గైరోలాను నియమించారు. ఇప్పుడు ఆయన స్థానంలో జేసీ పంత్‌ను నియమించారు.
ఇదిలా ఉంటే విశాఖపట్నానికి చెందిన రాధాగాయత్రికి శ్రీచరణ్ అనే వ్యక్తితో 45 రోజుల క్రితమే వివాహం జరిగింది. వీరిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 45రోజులకు ఉత్తరాఖండ్ లోని ముస్సోరికి హనీమూన్ వెళ్లారు. కాగా ముస్సోరిలోని ఓ హోటల్ లో రాధాగాయత్రి అనుమానాస్పద స్థితితో మృతి చెందారు. రాధాగాయత్రిని తమ అల్లుడే చంపాడని అత్త, మామ అరోపిస్తున్నారు. శ్రీచరణ్ మాత్రం తాను రాధాగాయత్రిని చంపలేదని చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండగా అసలు ఏం జరిగింది అనేది ఉత్కంఠగా మారింది.






