పరవశింపజేసిన 'పంచతంత్ర నృత్య కథలు'

by Taduka Kalyani |

అభినయమే భాషగా, హాస్య చమత్కారాలే హంగులుగా సాగిన ఈ 'పంచతంత్ర నృత్య కథలు' నృత్య రూపకానికి రవీంద్రభారతి వేదికైంది.

పరవశింపజేసిన పంచతంత్ర నృత్య కథలు
X

దిశ, రవీంద్ర భారతి : అభినయమే భాషగా, హాస్య చమత్కారాలే హంగులుగా సాగిన ఈ 'పంచతంత్ర నృత్య కథలు' నృత్య రూపకానికి రవీంద్రభారతి వేదికైంది. హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందిన ఇరవై మంది కళాకారులు ఈ ప్రదర్శనను రక్తికట్టించారు. భరత నాట్య నృత్య రీతులు, హావభావాలతో కూడిన ఈ ప్రదర్శన ఆద్యంతం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. హాస్యం, భావోద్వేగం, చమత్కారం, అద్భుతమైన విజువల్స్‌తో కథా సంప్రదాయాల గొప్పదనాన్ని చాటి చెప్పడమే కాకుండా, అందరినీ అలరించింది. ప్రముఖ నృత్యకారిని, పద్మశ్రీ డా. ఆనంద శంకర్ జయంత్ అద్భుతమైన కొరియోగ్రఫీ, దర్శకత్వంలో శంకరానంద కళాక్షేత్ర సమర్పించిన ఈ సరికొత్త నృత్య నాటక ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. భారత ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖకు చెందిన ‘అసిస్టెన్స్ టు కల్చరల్ ఆర్గనైజేషన్స్ విత్ నేషనల్ ప్రెజెన్స్’ సాకారంతో 78 నిమిషాల పాటు సాగిన ఈ వినూత్న ప్రదర్శనలో పంచతంత్రం నుంచి ఐదు ప్రసిద్ధ కథలను ప్రదర్శించారు. ఉపమానాలు రూపకాల ద్వారా ఈ నృత్య నాటకం స్నేహం, శౌర్యం, సమయస్ఫూర్తి, మూర్ఖత్వం, నాయకత్వ లక్షణాలు, స్వేచ్ఛ వంటి విలువలు వివరించింది. హాస్యం, చమత్కారాలతో కూడిన ఈ నృత్య, నాటక ప్రదర్శనలో పంచతంత్రం నుంచి ఐదు ప్రసిద్ధ కథలు మన కళ్ళకు కట్టినట్లు చూపించారు.

Next Story