హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు.. ఆయా హోటళ్లకు నోటీసు జారీ

by Kodari Anjali |

హోటళ్లు, రెస్టారెంట్లలో ఎంఎంసీ,ఫుడ్ సేప్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.

హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు.. ఆయా హోటళ్లకు నోటీసు జారీ
X

దిశ, మేడ్చల్ బ్యూరో: హోటళ్లు, రెస్టారెంట్లలో ఎంఎంసీ,ఫుడ్ సేప్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. శుక్రవారం నాగోల్ లోని దసరా, ఫ్లాగ్‌షిప్ వైబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ల లో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తనిఖీల సందర్భంగా ఆయా రెస్టారెంట్లు ఆహార భద్రత, పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించడలేదని తేలింది. కిచెన్ ఫ్లోరింగ్ జారుడుగా ఉండి, నీరు సక్రమంగా పోవడంలేదు. గడువు తీరిన4 ప్యాకెట్ల బాలాసా పంజాబీ మసాలా పాపడ్ తోపాటు ఎక్స్ పైరీ డేట్ దాటిపోయిన 200 గ్రాముల గోల్డ్ క్రౌన్ మస్టర్డ్ సాస్ ను వంటల్లో ఉపయోగిస్తూ దొరికిపోయారు. వంట గదుల్లో ఆహార పదార్థాలపై మూతలు పెట్టపోవడంతో ఈగలు స్తైర విహారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్ గోడలు, పైకప్పు మురికిగా, ప్యాచీలతో ఉండటం, రిఫ్రిజిరేటర్ పరిశుభ్రంగా లేకపోవడం, ఆహార వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించకపోవడం వల్ల అవి నేలపై చెల్లాచెదురుగా ఉండటాన్ని గమనించారు. పుట్ సేప్టీ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేకపోవడంతోపాటు నీటి నాణ్యత పరీక్షలు కూడా చేయడంలేదని ఆహార పదార్థాలపై లేబుళ్లు లేకపోవడాన్ని గుర్తించారు. హోటల్ సిబ్బంది ఏ ప్రాన్ లు, గ్లోవ్స్ ధరించకుండానే ఆహార భద్రతా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తుండడంతో ఈ లోపాలను తీవ్రంగా పరిగణించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం–2006 నిబంధనల ప్రకారం సంస్థ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసి, నిర్దిష్ట గడువులోగా అన్ని లోపాలను సరిచేయాలని ఆదేశించారు.

హైజీన్ రేటింగ్: 65 శాతం

ఈ సందర్భంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్,పుట్ సేప్టీ అధికారులు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యమని, ఆహార వ్యాపార సంస్థలపై ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు. అన్ని ఆహార వ్యాపార నిర్వాహకులు పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు మరియు చట్టబద్ధమైన నిబంధనలను కచ్చితంగా పాటించి వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు.

Next Story