అన్నపురెడ్డిపల్లి శ్రీ బాలాజీ క్షేత్రంలో ఘనంగా సుదర్శన హోమం

by Ratna Kumari |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని పురాతన శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.

అన్నపురెడ్డిపల్లి శ్రీ బాలాజీ క్షేత్రంలో ఘనంగా సుదర్శన హోమం
X

దిశ, అన్నపురెడ్డిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని పురాతన శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన శ్రవణ నక్షత్రం సందర్భంగా ఉదయం నుంచే ఆలయం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో లోకకల్యాణం, భక్తుల కోరికల నెరవేర్పు కోసం సుదర్శన హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి నెలా శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమాలను ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు, ప్రతాపురం రంగనాథ ఆచార్య స్వామి, యజ్ఞాచార్య స్వామి పర్యవేక్షించగా, సహాయ అర్చకుడు నీరజ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Next Story