పొలాల్లోకి దూసుకెళ్లిన స్కార్పియో.. తప్పిన ప్రమాదం

by Vemula.Srinu Prasad |

ఎమ్మిగనూరు నుంచి మంత్రాలయం వైపు వెళ్తుండగా ఒక స్కార్పియో వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. కలుదేవకుంట గ్రామం సమీపంలోకి రాగానే వాహనం అదుపు తప్పి, రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది....

పొలాల్లోకి దూసుకెళ్లిన స్కార్పియో.. తప్పిన ప్రమాదం
X

దిశ, మంత్రాలయం: ఎమ్మిగనూరు నుంచి మంత్రాలయం వైపు వెళ్తుండగా ఒక స్కార్పియో వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. కలుదేవకుంట గ్రామం సమీపంలోకి రాగానే వాహనం అదుపు తప్పి, రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వాహనం దాదాపు నాలుగు పల్టీలు కొట్టి పొలంలో ఆగిపోయింది. ఈ ప్రమాదంలో వాహనం తీవ్రంగా ధ్వంసమైందని పొలం యజమాని తెలిపారు.

కాగా, ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్ ఒక్కడే ఉండటం, ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనం మంత్రాలయానికి చెందిన పన్నాగా వెంకటేశ్ స్వామిదిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో రాఘవేంద్ర అనే డ్రైవర్ వాహనాన్ని నడుపుతున్నారు. లక్కీగా వాహనంలో ఇతర ప్రయాణికులు ఎవరూ లేకపోవడం, డ్రైవర్‌ సురక్షితంగా బయటపడటంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయిందనీ స్థానికులు తెలిపారు.

Next Story