రైతన్నలకు గుడ్ న్యూస్: 5 ఎకరాల వరకు ‘రైతుభరోసా’ నిధులు విడుదల

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రజా ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి/ వానకాలం పెట్టుబడి సాయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతుభరోసా' నిధుల విడుదల కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది.

రైతన్నలకు గుడ్ న్యూస్: 5 ఎకరాల వరకు ‘రైతుభరోసా’ నిధులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రజా ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి/ వానకాలం పెట్టుబడి సాయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతుభరోసా' నిధుల విడుదల కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 5 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

నాలుగో రోజుకు చేరిన నిధుల పంపిణీ..

రాష్ట్రవ్యాప్తంగా రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమం వరుసగా నాలుగో రోజుకు చేరింది. తక్కువ భూమి ఉన్న రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, విడతల వారీగా అకౌంట్లలో డబ్బులు జమ చేసే ప్రక్రియను వ్యవసాయ, ఆర్థిక శాఖలు ముమ్మరం చేశాయి. మొదటి రోజు ఒకటి, రెండు ఎకరాల లోపు ఉన్న రైతులతో ప్రారంభమైన ఈ ప్రక్రియ.. నిరంతరాయంగా సాగుతూ నేడు 5 ఎకరాల పరిమితి వరకు ఉన్న రైతులందరికీ వర్తింపజేశారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకే (DBT ద్వారా) నగదు జమ అవుతుండటంతో రైతుల మొబైల్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి.

సకాలంలో పెట్టుబడి సాయం..

వ్యవసాయ సీజన్ ప్రారంభమైన తరుణంలో, సకాలంలో పెట్టుబడి సాయం అందడంపై రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో లాగా కాకుండా, ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా. నేరుగా తమ అకౌంట్లలోకే డబ్బులు రావడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం.. ఇచ్చిన మాట ప్రకారం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, మిగిలిన రైతులకు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా రాబోయే రోజుల్లో నిధులు జమ అయ్యేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని సచివాలయ వర్గాలు వెల్లడించాయి.

Next Story