- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ పాలనలో పాలమూరుకు అన్యాయం: ఎంపీ డాక్టర్ మల్లు రవి
కేసీఆర్ పాలనలో పాలమూరు ప్రాంతానికి అన్యాయం జరిగిందని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి విమర్శించారు.

దిశ, కందనూల్: కేసీఆర్ పాలనలో పాలమూరు ప్రాంతానికి అన్యాయం జరిగిందని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో మల్లురవి మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావులు హిట్లర్ మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మోస పూరితమైన గోబెల్స్ ప్రచారం మానుకోవాలన్నారు. ప్రజలకు మోసం చేయడం వల్లే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65% సర్పంచులను గెలుచుకుందన్నారు.
కేసీఆర్ పాలనలో కృష్ణానదిలో జలదోపిడి..
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రన్నీ అభివృద్ధి చేస్తున్నారన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన చాలెంజ్ కు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్లు అప్పు చేశారని ఆ అప్పులు తీర్చుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. కేసిఆర్ ముఖ్యమంత్రి అయి పాలమూరు జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. కేసీఆర్ పాలనలో కృష్ణానదిలో జలదోపిడి జరిగిందని, పాలమూరుకు అన్యాయం జరిగిందన్నారు. దేశంలో తమది రామ రాజ్యమంటూ.. రాముడి సొమ్మునే దోచుకుంటున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రంజక ప్రజా పాలన కొనసాగుతున్నదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకుండేదే లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాలేశ్వరం కడతానన్న ప్రాజెక్ట్ కూలిపోయిందన్నారు.
అప్పులు ఆధారాలతో నిరూపిస్తాం...
కేసీఆర్ ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులను ఆధారాలతో నిరూపిస్తామని లేదంటే రాజీనామా చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పిన మాటలు అక్షర సత్యమని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ కూచకుళ్ళ రాజేష్ రెడ్డి స్పష్టం చేశారు. 8 లక్షల రూపాయల అప్పు చేశారని నిరూపించకుంటే రాజీనామా చేస్తానని మంత్రి జూపల్లి సవాల్ విసిరితే కేటీఆర్ తెలంగాణ భవన్లో కూర్చి వేసుకుని కూర్చున్నారని విమర్శించారు. మూసీ నది ప్రక్షాళన, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కేటీఆర్, హరీశ్ రావు గత ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయని చెప్పారని, ఎంపీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసిందన్నారు.
నార్లపూర్ ద్వారా ఒక్క ఎకరానికి..
కేసీఆర్ పాలనలోనే కృష్ణా జల దోపిడి ఎక్కువగా జరిగిందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అపెక్స్ సమావేశానికి ఎప్పుడూ కేసీఆర్ వెళ్లలేదని, రోజా ఇంటికి పోయి రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి పథకంతో ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చినట్లు నిరూపించినా పాలమూరు ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తామన్నారు. 8 లక్షల కోట్ల అప్పులతో పాలమూరుకు ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. నార్లపూర్ ద్వారా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని, డ్రామాలు చేయవద్దన్నారు. మంత్రి జూపల్లి సవాల్ ను కేటీఆర్, హరీశ్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి మిడ్జిల్ వస్తున్నారని, గతం మర్చిపోకుండా కృతజ్ఞతలు చెపుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల్ సునేంద్ర, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నిరంజన్, యూత్ అధ్యక్షుడు వినోద్నా యకులు పాల్గొన్నారు.






