వివాదాస్పదంగా జనసేన ఎమ్మెల్యే తీరు

by Ajay Maddhiboyina |

పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తీరు వివాదాస్పదంగా మారింది. నడిరోడ్డుపై ట్రాఫిక్ మధ్యలో కారు టాప్ ఎక్కి మరీ ఆయన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

వివాదాస్పదంగా జనసేన ఎమ్మెల్యే తీరు
X

దిశ,వెబ్ డెస్క్: పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తీరు వివాదాస్పదంగా మారింది. నడిరోడ్డుపై ట్రాఫిక్ మధ్యలో కారు టాప్ ఎక్కి మరీ ఆయన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను నిలబెట్టబోయే వ్యక్తి గెలవకపోతే తన పేరు బాలరాజు కాదని సవాల్ చేశారు. 2024 ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించారని, నియోజకవర్గంలో జనసేన బలంగా ఉందని చెప్పడానికి అదే నిదర్శనం అని అన్నారు. రెండేళ్లలో నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా తాను అభివృద్ధి చేసి చూపించాన‌ని చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ్రామాన్ని, ప్ర‌తి మండ‌లాన్ని అభివృద్ధి చేశామ‌ని అన్నారు.

అంతేకాకుండా ఈ రెండేళ్ల‌లో ఎన్నో అవ‌మానాలు ప‌డ్డాం అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌న నాయ‌కుల‌తో ఎంతో ఇబ్బంది ప‌డ్డామ‌ని, ఈరోజుతో దొర‌ల పాల‌న నుండి పోలవ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి విమ‌క్తి ల‌భిస్తుంద‌ని అన్నారు. రాబోయే కాలంలో త‌న‌కోసం నిల‌బ‌డిన కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు భ‌రోసా ఇస్తాన‌ని చెప్పారు. అయితే రోడ్డు మ‌ధ్య‌లో కారు టాప్ ఎక్కి ఎమ్మెల్యే స్పీచ్ ఇవ్వ‌డం వివాదాస్ప‌దంగా మారింది. వాహ‌న‌దారుల‌ను ఆపి,వారు ఇబ్బంది ప‌డుతుంటే స్పీచ్ ఇవ్వ‌డం ఏంట‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో ఎమ్మెల్యేపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story