అనుచిత వ్యాఖ్యల కేసు.. ప్రశ్న రావణ్‌కు వైద్య పరీక్షలు

by Vemula.Srinu Prasad |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ పోలీసులు కాసేపట్లో మచిలీపట్నం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు....

అనుచిత వ్యాఖ్యల కేసు.. ప్రశ్న రావణ్‌కు వైద్య పరీక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Ap Deputy Cm Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్(Youtuber Prasna Ravan) పోలీసులు కాసేపట్లో మచిలీపట్నం కోర్టు(Machili Patnam)లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆయన్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్విస్తున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

సర్పవరంలో నమోదైన కేసులో..

ఇప్పటికే కాకినాడ జిల్లా సర్పవరంలో నమోదైన కేసులో రావణ్‌కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మచిలీపట్నం ఇనగుదురు పీఎస్‌లో నమోదైన కేసులో రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తదుపరి చర్యలు కొనసాగిస్తున్నారు. కోర్టు సూచనల మేరకు ఆయన్ను రిమాండ్‌కు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా మచిలీపట్నం 31వ డివిజన్ జనసేన ఇంచార్జి ఉడుముల బుజ్జి ఇచ్చిన ఫిర్యాదుతో రావణ్‌పై కేసు నమోదు అయింది.

Next Story