- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరిశుభ్రతతో రోగాలు దరిచేరవు: డిప్యూటీ కమిషనర్
దొమ్మరపోచపల్లి డబుల్ బెడ్ రూమ్స్‌లో పారిశుధ్యంపై దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వెంకటమణికరణ్ అవగాహన కల్పించారు.

దిశ, దుండిగల్: పరిసరాల పరిశుభ్రతతో రోగాలు దరిచేరవని, వర్షాకాలంలో దోమలు, క్రిమికీటకాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వెంకటమణికరణ్ తెలిపారు. ఫ్రైడే.. ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దొమ్మరపోచపల్లిలోని డబుల్ బెడ్ రూమ్స్‌లో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి వాటిని నిర్మూలించడమే ఫ్రైడే.. ఫ్రైడే కార్యక్రమం అన్నాడు. కుండీలు, పాత ట్రైర్లు వాడని పాత్రలు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరవన్నాడు. దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ డిప్యూటీ ఇంజినీర్ అన్వేష్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజినీర్ అశోక్ కుమార్, ఎంవిరాన్మెంట్ ఇంజినీర్ సాత్విక, శ్రీనివాస్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






