దేశ రక్షణలో ఆర్మీ జవాన్‌.. సొంత ఊరిలో కరువైన రక్షణ

by Vemula.Srinu Prasad |

దేశ రక్షణలో భాగంగా నంద్యాల జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మహేష్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు...

దేశ రక్షణలో ఆర్మీ జవాన్‌.. సొంత ఊరిలో కరువైన రక్షణ
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రక్షణలో భాగంగా నంద్యాల జిల్లా(Nandyala District)కు చెందిన ఆర్మీ జవాన్ మహేష్(Army Jawan Mahesh) సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సొంత ఊరిలో తన భూమికి రక్షణ కరువైంది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu)కు వీడియో ద్వారా చెప్పుకున్నారు. తన భూమి(Land)ని అక్రమార్కులు ఆక్రమిస్తున్నారంటూ(Grabbing) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతుంటే తన సొంత గ్రామంలో తన ఆస్తికి రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.

జవాన్ భూమి కబ్జా

నంద్యాల జిల్లా తమ్మడపల్లి గ్రామానికి చెందిన జవాన్ మహేష్‌ ఆర్వీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయనకు గ్రామంలో 2 ఎకరాల 38 సెంట్ల భూమి ఉంది. అయితే ఈ భూమిని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో రెవెన్యూ, పోలీస్ అధికారుల చుట్టూ తమ బంధువులు తిరిగారు. వారికి ఫిర్యాదు చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తనకు న్యాయం చేయాలని స్వయంగా మహేష్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో మహేష్ వీడియో వైరల్

అయితే జవాన్ మహేష్ సైనిక దుస్తుల్లోనే ఉండి ఈ వీడియో రికార్డ్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జవాన్‌కే ఇలాంటి పరిస్థితి రావడంపై వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, ఉన్నతాధికారులు స్పందించి జవాన్ మహేష్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story