రైల్వే ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వ్యక్తి మృతి

by Ratna Kumari |

రైల్వే ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వ్యక్తి మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లోని మూడో నంబర్ ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. స్టేషన్ మేనేజర్ అందించిన సమాచారం మేరకు సుమారు 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తి గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్లాట్‌ఫాంపై మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అనారోగ్య కారణాలతో సహజ మరణం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే మృతుడిని గుర్తించేలా ఎలాంటి గుర్తింపు పత్రాలు లేదా ఇతర ఆధారాలు లభించలేదని తెలిపారు. ఈ ఘటనపై రైల్వే హెడ్ కానిస్టేబుల్ (ఆర్‌హెచ్‌సీ-76) ఎ.సురేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నిజామాబాద్ రైల్వే ఎస్‌ఐ సాయిరెడ్డిని 8712658591 నంబర్‌లో సంప్రదించి సమాచారం అందించాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Next Story