మహిళల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

by Taduka Kalyani |

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.

మహిళల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
X

దిశ, ములుగు : ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మార్కుక్‌లో జరిగే నాభి శిల ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. పేదలు, మహిళలు, రైతులు, యువతను దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ గృహాల ద్వారా నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, సామాజిక న్యాయమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ గౌడ్, గ్రామ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కనకయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోర్సు శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కడపల నరసింహారెడ్డి, ర్యాకం యాదగిరి, బీర్ బాల్ సింగ్, శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Next Story