మంత్రి అడ్లూరి చాలెంజ్.. గన్‌పార్క్‌కు బయల్దేరిన హరీష్ రావు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-02 06:05:46  IST  )

అధికార - ప్రతిపక్షాల మధ్య సవాళ్లు - ప్రతిసవాళ్లతో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది.

మంత్రి అడ్లూరి చాలెంజ్.. గన్‌పార్క్‌కు బయల్దేరిన హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార - ప్రతిపక్షాల మధ్య సవాళ్లు - ప్రతిసవాళ్లతో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. గురుకులాల్లో అవినీతి, గత ప్రభుత్వ అప్పులు, ప్రస్తుతం ప్రభుత్వం చేసిన అప్పులపై చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ లు తెలిపారు. తాము గన్ పార్క్ వద్దే ఉంటామని హరీష్ రావు, కేటీఆర్ అక్కడికే రావాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో ఏ మేరకు నిధులు ఖర్చు చేశామో ఆ హిస్టరీ మొత్తం తమ వద్ద ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. వాళ్ల పాపాలు, తమ అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామంటూ అమరవీరుల స్థూపం వద్ద బైఠాయించారు. ఈ ఆధారాలన్నీ ప్రెస్ క్లబ్ వద్ద అందిస్తానని తెలిపారు. లేదంటే కేసీఆర్ ను ఫాంహౌస్ వదిలి అసెంబ్లీకి రమ్మని చెప్పాలని, అక్కడ చర్చించేందుకు కూడా తాము రెడీ అన్నారు. ఈ సవాళ్లను మొదలు పెట్టిన హరీష్ రావు వెంటనే చర్చకు రావాలన్నారు. గురుకులాల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే.. ఏం చేయడానికైనా రెడీగా ఉన్నామన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఏ శాఖపై ప్రశ్నించినా సమాధానం చెప్తామన్నారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిగా.. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై చర్చించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

పారిపోకండి.. మేమే వస్తున్నాం..

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాలును స్వీకరించిన హరీష్ రావు.. తామే గన్ పార్క్ వద్దకు వెళ్తామన్నారు. అవినీతి అప్పులపై చర్చించేందుకు ప్రెస్ క్లబ్ రమ్మని సవాల్ చేస్తే.. అమరవీరుల స్థూపం వద్దకు రమ్మన్నారని, తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. తామే గన్ పార్క్ వద్దకు బయల్దేరుతున్నామని, ఈలోగా మంత్రులు అక్కడి నుంచి పరారవ్వొద్దని, ఈ మధ్యలో తమను అరెస్ట్ చేయించే కుట్రలు చేయవద్దన్నారు. గన్ పార్క్ వద్దే సాయంత్రం వరకూ చర్చిద్దామన్నారు.

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో హరీష్‌రావు

Next Story