హామీలు అడిగితే రక్తం కళ్లజూస్తారా?.. పోలీసులపై రెచ్చిపోయిన కవిత

by Gantepaka Srikanth |

బోడుప్పల్‌లో భూ పోరాటం చేస్తోన్న తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

హామీలు అడిగితే రక్తం కళ్లజూస్తారా?.. పోలీసులపై రెచ్చిపోయిన కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: బోడుప్పల్‌లో భూ పోరాటం చేస్తోన్న తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారీని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉప్పల్ పరిధిలో జరిగిన ఈ భూ పోరాటం ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు ఉద్యమకారులు, మహిళలపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళల రక్తం చిందింది: కల్వకుంట్ల కవిత

బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో కవిత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "ఉప్పల్‌లో ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందింది. పోలీసులు మహిళలను కూడా చూడకుండా విచక్షణారహితంగా లాఠీ ఛార్జ్ చేయడం అత్యంత అన్యాయం" అని ఆమె మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్..

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను మాత్రమే తాము అడిగామని, అంతకుమించి ఎలాంటి ఇతర డిమాండ్లు పెట్టలేదని కవిత స్పష్టం చేశారు. "ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలని మాత్రమే మేము డిమాండ్ చేశాం. ఇచ్చిన హామీలను అడిగితే లాఠీలతో కొట్టి రక్తం చిందించడం ప్రజాస్వామ్యమా?" అని ప్రశ్నించారు. ఈ రోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఆమె హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు, వాటిని ఈ ప్రభుత్వానికి ప్రతిరోజూ గుర్తు చేస్తూనే ఉంటామని. ఉద్యమకారుల తరఫున పోరాటం ఆపబోమని కల్వకుంట్ల కవితే తేల్చి చెప్పారు.

Next Story