- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ కథనానికి స్పందన.. బయ్యారం పంచాయతీ నిధుల అవకతవకలపై డీపీవో విచారణ
బయ్యారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ పరిపాలనా కాలంలో జరిగిన నిధుల గోల్మాల్ వ్యవహారంపై అధికార యంత్రాంగం కదిలింది.

దిశ, బయ్యారం: బయ్యారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ పరిపాలనా కాలంలో జరిగిన నిధుల గోల్మాల్ వ్యవహారంపై అధికార యంత్రాంగం కదిలింది. ఈ అక్రమాలపై జూన్ 29న వార్డు సభ్యులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం, దీనిపై 'దిశ' వెబ్‌సైట్‌లో కథనం ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) హరిప్రసాద్ గురువారం బయ్యారం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన రిజిస్టర్లను, ఎంబీ (మెజర్మెంట్ బుక్) రికార్డులను ఆయన నిశితంగా పరిశీలించారు. డీపీఓ విచారణకు వచ్చిన విషయం తెలుసుకున్న పలువురు పంచాయతీ వార్డు సభ్యులు కార్యాలయానికి చేరుకుని అక్రమాలపై ఆయనకు వివరించారు.
శానిటేషన్ బిల్లులు వారికి అనుకూలంగా ఉన్న వారి ఫేక్ బిల్లులను సృష్టించినట్లు వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలు విషయాలను నిగ్గు తేల్చి గతంలో పనిచేసిన సెక్రటరీ అక్రమాలపై పూర్తి విచారణ చేయాలని డిపిఓకు అభ్యర్థించారు. శానిటేషన్ కింద పనిచేసిన కూలీలు వీరన్నకు సుమారుగా లక్ష యాభై వేల రూపాయలు, అదేవిధంగా శానిటేషన్ కింద 2024 నుంచి 25 సంవత్సరంలో పిచ్చి మొక్కలు ,గడ్డి మందులకు, ఓ ఫెర్టిలైజర్ షాప్ యజమానికి 96 వేల రూపాయలు మందులు తీసుకొని బిల్లులు ఇవ్వకుండా నేటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం.
బాకీ ఉన్నా నిధులు వారి కి రాకపోవడంతో డిపిఓ కు ఫిర్యాదు చేశారు. జనరల్ ఫండ్ కింద వచ్చిన నిధులు అసలైన వారికి ఇవ్వకుండా పంచాయతీ సిబ్బంది బ్యాంకు ఖాతా ల నుంచి దారి మళ్లించినట్లు తెలుస్తుంది. ఈ విషయాలు విచారణ అధికారి డిపిఓ నోట్ చేసినట్లు సమాచారం, పై విషయాలపై ఏ మేరకు విచారణ చేపడతారో..! అసలు విషయం అధికారి వెల్లడిస్తే గాని అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. విచారణ పారదర్శకంగా జరిపి.. సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటారో.. ! లేదో..! ఫిర్యాదు దారులు వేచి చూడాల్సిందే ..! ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాంబాబు వార్డు సభ్యులు రమేష్ , సంపత్ తదితరులు పాల్గొన్నారు.






