- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముళ్ల చెట్టే ఆశ్రయం.. పక్షవాత బాధిత యువకుడికి అండగా అన్నం ఫౌండేషన్
కుటుంబ సభ్యుల ఆదరణ లేక, పక్షవాతంతో నిస్సహాయ స్థితిలో ముళ్ల చెట్టు కిందే జీవనం సాగిస్తున్న ఓ యువకుడికి అన్నం ఫౌండేషన్ అండగా నిలిచి మానవత్వాన్ని చాటింది.

దిశ, కేసముద్రం : కుటుంబ సభ్యుల ఆదరణ లేక, పక్షవాతంతో నిస్సహాయ స్థితిలో ముళ్ల చెట్టు కిందే జీవనం సాగిస్తున్న ఓ యువకుడికి అన్నం ఫౌండేషన్ అండగా నిలిచి మానవత్వాన్ని చాటింది. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని బడి తండాకు చెందిన సుమారు 30 ఏళ్ల వినోద్ పక్షవాతం కారణంగా చేతులు, కాళ్లు, నోరు సరిగా పనిచేయని స్థితికి చేరుకుని అత్యంత దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. సరైన ఆశ్రయం, సంరక్షణ లేక చెట్టు కిందనే కాలం గడుపుతున్న అతని పరిస్థితి స్థానికులను కలచివేసింది. వినోద్ పరిస్థితి గురించి సమాచారం అందుకున్న అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అన్నం శ్రీనివాస్ వెంటనే అక్కడికి చేరుకుని అతనికి ధైర్యం చెప్పారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో ఉన్న వినోద్‌కు స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగించి, ఆహారం అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స, సంరక్షణ కోసం ఖమ్మంకు తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. నిరాధారులు, అనాథలు, ఆపన్నులకు అండగా నిలుస్తూ అన్నం ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ఈ సేవా కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అరుణ కుమారి, దేవేందర్, మోహన్, సంజు, చిన్నా, కళ్యాణ్, వినోద్, బాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.






