- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాళం వేసిన ఇంట్లో చోరీ..
by Kodari Anjali |
పుల్లూరు గ్రామంలో తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడి బంగారం, వెండి ఆభరణాలను చోరీ చేసిన ఘటన జరిగింది.

X
దిశ, ఉండవెల్లి: మండలంలోని పుల్లూరు గ్రామంలో తాళం వేసిన ఇంట్లో కి దొంగలు చొరబడి బంగారం వెండి ఆభరణాలను చోరీ చేసిన ఘటన చోటు చేసుకున్నది. హెడ్ కానిస్టేబుల్ వీరన్న తెలిపిన విరాళాలు ఇలా ఉన్నాయి. పుల్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు భార్య భారతితో పాటు ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. భార్య భారతి నానమ్మ మృతి చెందడంతో ఆమె అస్థికలను కలిపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ జిల్లాకు జూన్ 1తేదీన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లోకి చొరబడి 4.5తులాల బంగారం, ఆరు తులాల వెండి చోరీ చేసినట్లు శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ పేర్కొన్నారు.
Next Story






