న్యూజెర్సీలో కూరగాయల కోసం ఎగబడ్డ గుజరాతీలు

by Muthe.Rajitha |

అమెరికాలోని న్యూజెర్సీలోని ఓ సూపర్ మార్కెట్లో భారతీయులు ఒక్కసారిగా కూరగాయల కోసం ఎగబడ్డారు.

న్యూజెర్సీలో కూరగాయల కోసం ఎగబడ్డ గుజరాతీలు
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలోని న్యూజెర్సీలోని ఓ సూపర్ మార్కెట్లో భారతీయులు ఒక్కసారిగా కూరగాయల కోసం ఎగబడ్డారు. అక్కడ కొత్తగా ప్రారంభమైన "అమెరికన్ సబ్జీ మండీ" అనే ఇండియన్ గ్రాసరీ స్టోర్ ప్రారంభోత్సవానికి జనం పోటెత్తారు. ముఖ్యంగా స్థానిక గుజరాతీలు స్వదేశీ కూరగాయలు, నిత్యావసర వస్తువుల కోసం భారీ సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. అమెరికా ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో, ముఖ్యంగా న్యూజెర్సీలో గుజరాతీ కమ్యూనిటీ జనాభా చాలా ఎక్కువ. ఇక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులకు భారతీయ వంటకాలు, ఇక్కడి ప్రత్యేక కూరగాయలు, మసాలా దినుసుల కోసం భారీగా డబ్బులు వెచ్చిస్తుండటమే కాకుండా.. వారాంతాల్లో మార్టులు, రెస్టారెంట్లు కిక్కిరిసి పోతాయి. ఇక కొత్తగా తెరిచిన ఈ స్టోర్‌లో భారతదేశానికి చెందిన అథెంటిక్ కూరగాయలు, తాజా సబ్జీలు, సాంప్రదాయ స్నాక్స్, ఫ్రోజెన్ ఐటమ్స్ అన్నీ ఒకే చోట లభిస్తుండటంతో గుజరాతీలు పెద్ద ఎత్తున ఇక్కడికి క్యూ కట్టారు. దీంతో స్టోర్ లో భారీగా రద్దీ పెరిగి, ఒకానొక దశలో గ్రోసరీ కోసం ఒకరినొకరు తోసుకున్నారు. ఈ వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఇండియన్స్ ఎక్కడికి వెళ్లినా ఇంతే, క్రమశిక్షణ అనేది ఉండదు, దేశం పరువు తీస్తున్నారంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.

Next Story