బాచుపల్లి ఎక్స్‌రోడ్స్ వద్ద 13 కిలోల గంజా స్వాధీనం..

by Kodari Anjali |

బాచుపల్లిలో భారీగా గంజాయినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బాచుపల్లి ఎక్స్‌రోడ్స్ వద్ద 13 కిలోల గంజా స్వాధీనం..
X

దిశ, కుత్బుల్లాపూర్: బాచుపల్లిలో భారీగా గంజాయినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బాచుపల్లి ఎక్స్‌రోడ్స్ సమీపంలో దాడి నిర్వహించి 13 కిలోల గంజాతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్టైన నిందితుడు కృష్ణ జెనా (29) ఒడిశాలోని గంజాం జిల్లా వాసి కాగా, ప్రస్తుతం గుజరాత్‌లోని సూరత్‌లో నివాసముంటున్నాడు. అతని వద్ద నుంచి ఏడు ప్యాకెట్లలో ఉన్న 13 కిలోల గంజాతో పాటు ఒక వివో మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు ఒడిశా నుంచి గంజాను తీసుకువచ్చి సూరత్‌లో అక్రమంగా విక్రయించేందుకు తరలిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ కేసులో ఒడిశాలోని బలుగావ్‌కు చెందిన జీలా అనే వ్యక్తిని పరారీలో ఉన్న నిందితుడిగా గుర్తించిన బాచుపల్లి పోలీసులు, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story