రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

by Ratna Kumari |

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని లచ్చాపేట గ్రామ స్టేజి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
X

దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని లచ్చాపేట గ్రామ స్టేజి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. లచ్చాపేట గ్రామానికి చెందిన బూస వేణు మాచారెడ్డి చౌరస్తా నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా, పీడబ్ల్యూడీ రోడ్డునుంచి లచ్చాపేట గ్రామానికి మలుపు తిరుగుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న గూడ్స్ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేణుకు కాలు, చేయి విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story