Delhi: ఢిల్లీలో భర్త హత్య కేసులో యువతి అరెస్ట్

by S Gopi |

మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, అతని భార్య అలీషా (20)పై అనుమానం వ్యక్తమైంది.

Delhi: ఢిల్లీలో భర్త హత్య కేసులో యువతి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని జగత్‌పురి ప్రాంతంలో వివాహేతర సంబంధంపై అనుమానంతో తలెత్తిన కుటుంబ కలహం హత్యకు దారితీసిన ఘటనలో 20 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, జూలై 2 తెల్లవారుజామున రషీద్ మార్కెట్‌లోని ఇంట్లో ముస్తకీమ్ అలియాస్ సాహిల్ (20) అపస్మారక స్థితిలో కనిపించగా, ఆసుపత్రికి తరలించేలోపే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, అతని భార్య అలీషా (20)పై అనుమానం వ్యక్తమైంది. విచారణలో, తనపై భర్తకు వివాహేతర సంబంధం గురించి అనుమానం ఉండేదని, అదే కారణంగా మొబైల్ ఫోన్‌ను పరిశీలించే విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని ఆమె తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ ఘర్షణలో భర్త తనపై దాడి చేయడంతో కోపంతో దుపట్టాతో గొంతు నులిమినట్లు ఆమె చెప్పిందని పోలీసులు వివరించారు. ఘటన అనంతరం ఆమె సమీపంలోని గురుద్వారాలో తలదాచుకోగా, కొద్ది గంటల్లోనే పోలీసులు ఆమె అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న దుపట్టాను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Next Story