​మాతృశ్రీ కళాశాలలో 'జర్నలిజం’ అడ్మిషన్లు...

by Kodari Anjali |

‘మాతృశ్రీ డిగ్రీ కళాశాల’లో జర్నలిజం కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వల్లూరి రామారావు ఒక ప్రకటనలో తెలిపారు.

​మాతృశ్రీ కళాశాలలో జర్నలిజం’ అడ్మిషన్లు...
X

​దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థ ‘మాతృశ్రీ డిగ్రీ కళాశాల’లో జర్నలిజం కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వల్లూరి రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని హుజురాబాద్ రీజియన్‌లో జర్నలిజం కోర్సును అందిస్తున్న ఏకైక కళాశాల మాతృశ్రీ అని ఆయన పేర్కొన్నారు.

​అర్హతలు.. కోర్సు వివరాలు..

ఇంటర్మీడియట్ (రెగ్యులర్) లేదా ఓపెన్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని, అతి తక్కువ ఫీజుతోనే నాణ్యమైన జర్నలిజం విద్యను అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వివరించారు.

​మీడియా రంగంలో ఉపాధి అవకాశాలు...

ప్రస్తుత సమాజంలో మీడియా రంగానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి.. రిపోర్టింగ్, యాంకరింగ్, న్యూస్ రీడింగ్, డెస్క్ ఆపరేషన్స్, ఎడిటర్, సబ్-ఎడిటర్, అడ్వర్టైజింగ్ వంటి విభాగాలలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఈ కోర్సు ఎంతో దోహదపడుతుందని ఆయన స్పష్టం చేశారు. జర్నలిజం కోర్సులో చేరాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా హుజురాబాద్‌లోని కళాశాల కార్యాలయంలో సంప్రదించి అడ్మిషన్లు పొందవచ్చని, ఇతర పూర్తి వివరాల కోసం 94405 14629 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని ప్రిన్సిపాల్ వల్లూరి రామారావు సూచించారు.

Next Story