ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిబంధనలు పాటించాల్సిందే : డి ఎం హెచ్ ఓ

by Taduka Kalyani |

జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్ అన్నారు.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిబంధనలు పాటించాల్సిందే : డి ఎం హెచ్ ఓ
X

దిశ, మంచిర్యాల: జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్ అన్నారు. శుక్రవారం వైద్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ప్రైవేట్ వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ప్రైవేట్ ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారంగా నడుచుకోవాలన్నారు. జిల్లాలో 11 చర్మ సంబంధిత వైద్య నిపుణులు, 22 మంది చిన్న పిల్లల వైద్య నిపుణులకు పలు సూచనలు చేశారు. ఆస్పత్రుల్లో అందరికీ కనిపించేలా వివిధ సేవలకు తీసుకునే రుసుముల పట్టికలు ప్రదర్శించాలని అన్నారు. ఆస్పత్రిలో బయో మెడికల్ వ్యర్థాల పై దృష్టి సారించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఉన్నారు.

Next Story