- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు
తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం మొయినాబాద్ మండలం అమ్దపూర్‌లో అన్నారు.

దిశ, మొయినాబాద్: తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం మొయినాబాద్ మండలం అమ్దపూర్‌లో అన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూధన్ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న గృహాలను ప్రారంభించిన ఆయన.. గుడిసెల్లో, కిరాయి ఇళ్లలో ఉంటున్న నిరుపేద కుటుంబాలను గుర్తించి పక్కా ఇళ్లు నిర్మించుకునేందుకు అర్హులుగా ప్రకటిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం అమ్డాపూర్ గ్రామ సర్వే నెంబర్ 289 ప్రభుత్వ భూమిలో 30 ఏళ్లుగా నివసిస్తున్న సుమారు 200 ఇళ్లకు ఇంటి నెంబర్లు కేటాయించాలని సర్పంచ్ మద్యపాగ కృష్ణ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేయగా, వెంటనే నెంబర్లు ఇచ్చి పంచాయతీకి పన్ను ఆదాయం వచ్చేలా చూడాలని ఎంపీడీవో హిమబిందును ఆదేశించారు. కార్యక్రమంలో మాడి రాజేందర్ రెడ్డి, అర్చన అజయ్ రెడ్డి, గ్రామ కార్యదర్శి కవిత రెడ్డి, విక్రమ్ రెడ్డి, నాయకులు పల్లగోల్ల అశోక్ యాదవ్, మన్నె ప్రభాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ఎలిగెపల్లి శ్రీనివాస్ యాదవ్, హనుమంతుయాదవ్, సురేందర్ రెడ్డి, కావలి చంద్రశేఖర్, అభినయ్ రెడ్డి, గోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.






