శ్రద్ధ ‘ఈఠ’కు ఊరట.. మద్ధతుగా నిలిచిన ఫ్యామిలీ!

by Chukka Sudharani |

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో , లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ఈఠ’.

శ్రద్ధ ‘ఈఠ’కు ఊరట.. మద్ధతుగా నిలిచిన ఫ్యామిలీ!
X

దిశ, సినిమా: శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో , లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ఈఠ’. మరాఠీ ‘లవాణి’ కళాకారిణి ‘విఠాబాయి నారాయణ్ గావ్‌కర్’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ నుంచి జూన్ 23న టీజర్ విడుదలై వివాదంలో చిక్కుకుంది. ‘ఈఠ’ టైటిల్ పేరుపై రాజకీయపార్టీ ఎన్‌సీపీ, విఠాబాయి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ‘సినిమాకు ‘విఠా’ లేదా ‘విఠాబాయి’ అని ఎందుకు పేరు పెట్టలేదు. విఠాబాయి మహారాష్ట్రకు చెందిన గొప్ప జానపద కళాకారిణి. ఆమె జీవితం ఆధారంగా వస్తోన్న ఈ సినిమాకు ఆమె పేరే ఉండాలి అని సూచించారు. అయితే తాజాగా శ్రద్ధాకపూర్ నటిస్తున్న ‘ఈఠ’కు ప్రముఖ లావణి కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్‌కర్ కుమార్తె మంగళా బన్సోడే కరవడికర్ మద్దతు తెలిపారు. ‘'ఈఠ' టైటిల్ విషయంలో మా కుటుంబానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ టైటిల్ చాలా సముచితమైనది, ఎందుకంటే మా అమ్మ ప్రదర్శనలు ఇచ్చిన గ్రామాల్లోని ప్రజలు ఆమెను తరచుగా 'ఈఠ' అని పిలిచేవారు’ అని తెలపగా.. మొత్తానికి ఈ సినిమాకు ఊరట కలిగినట్లు అయింది.

Next Story