ఇంటి నిర్మాణ పనుల్లో విషాదం.. ప్రాణాలు కోల్పోయిన కూలి

by Taduka Kalyani |   (  Updated:2026-07-03 15:37:27  IST  )

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఇంటి నిర్మాణ పనుల సందర్భంగా ప్రమాదవశాత్తు కిందపడి ఓ కూలీ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది

ఇంటి నిర్మాణ పనుల్లో విషాదం.. ప్రాణాలు కోల్పోయిన కూలి
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఇంటి నిర్మాణ పనుల సందర్భంగా ప్రమాదవశాత్తు కిందపడి ఓ కూలీ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలానికి చెందిన ఎల్లంకి రమేష్ (40)ను మేస్త్రి నరసింహ కవాడిపల్లి రోడ్డులో జరుగుతున్న నూతన ఇంటి నిర్మాణ పనులకు కూలీగా తీసుకెళ్లాడు. గురువారం (జూలై 2) మధ్యాహ్నం సుమారు 3:35 గంటలకు రమేష్ తాడుపై నిలబడి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో తీవ్ర గాయాలై అధిక రక్తస్రావమైంది. సహచరులు వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఎల్లంకి పరమేష్ ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్ మెట్ ఎస్సై మాధవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మాణ పనుల ప్రదేశంలో తగిన భద్రతా చర్యలు లేకపోవడమే ప్రమాదానికి కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story