- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అధికారులు ఒత్తిళ్లకు లొంగకుండా పని చేయాలి’: ఎంపీ ధర్మపురి అరవింద్
కేంద్ర ప్రభుత్వ పథకాల పనులు గడువులోగా పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమృత్ 2.0, స్వచ్ఛ భారత్, 15వ ఆర్థిక సంఘం, జాతీయ ఆరోగ్య మిషన్, పీఎంజీఎస్‌వై, పీఎం శ్రీ, పీఎం కుసుమ్ తదితర పథకాల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర నిధులు పూర్తిగా వినియోగించాలని సూచించారు. హెచ్‌పీవీ టీకాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, జాతీయ రహదారుల భూసేకరణ, కేంద్ర విద్యాలయానికి భూకేటాయింపు, పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకాల అమలును కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వాయిదా వేయొద్దు...
అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జాతీయ రహదారులపై డార్క్ స్పాట్స్ తొలగింపునకు కేంద్రం నిధులు విడుదల చేసినా కేంద్ర ప్రభుత్వ ఆర్ అండ్ బి శాఖ పనులు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నాయకులు లేదా వ్యక్తుల కోసం ఎదురు చూస్తూ వాయిదా వేయొద్దని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ.. అమృత్ 2.0, స్వచ్ఛ భారత్, జాతీయ ఆరోగ్య మిషన్, గ్రామీణ రహదారులు, జాతీయ రహదారులు, పీఎం శ్రీ తదితర కేంద్ర పథకాల పనులు జిల్లాలో పురోగతిలో ఉన్నాయని, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యులు, జిల్లా అదనపు ఎస్పీ చేతన్ నితిన్, అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్, మున్సిపల్ కమిషనర్లు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.






