- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gurugram: గురుగ్రామ్‌లో యువతిని సజీవదహనం చేసిన కేసులో వ్యక్తి అరెస్ట్
బంగారు ఆభరణాలు విక్రయించేందుకు అతని దుకాణానికి వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ఆ తర్వాత సంబంధం కొనసాగింది.

దిశ, నేషనల్ బ్యూరో: గురుగ్రామ్‌లో తనకు ఇప్పటికే వివాహమైందన్న విషయం బయటపడటంతో తలెత్తిన వివాదం చివరకు ఓ యువతి ప్రాణాలను బలిగొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సునీల్ కుమార్ అలియాస్ నోని (35), దివ్య కటారియా (23)తో దాదాపు ఏడాదిన్నరగా సహజీవనం చేస్తున్నాడు. బంగారు ఆభరణాలు విక్రయించేందుకు అతని దుకాణానికి వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ఆ తర్వాత సంబంధం కొనసాగింది. అయితే సునీల్‌కు ఇప్పటికే వివాహమైందని తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. జూన్ 18న ఈ రహస్యం బయటపడటంతో వారి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఆ మరుసటి రోజు ఉదయం సోహ్నా రోడ్‌లోని ఒక ఫ్లాట్‌లో నిందితుడు ఆమె దుస్తులపై కిరోసిన్ పోసి నిప్పంటించగా, తీవ్ర గాయాలపాలైన దివ్య ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 27న మరణించింది. తొలుత బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకపోయినా, అనంతరం బంధువు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి సునీల్‌ను అరెస్టు చేశారు. నిందితుడు నిజం చెబితే చంపేస్తానని బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని బెదిరించినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా నేరానికి ఉపయోగించినట్లు భావిస్తున్న కిరోసిన్ సీసా, నిందితుడి మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా, కోర్టు అతడిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. కేసులోని సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.






