నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా: ఎమ్మెల్యే

by Kodari Anjali |

వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అన్ని విధాలుగా అగ్రగామిగా నిలుపుతనాని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా: ఎమ్మెల్యే
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అన్ని విధాలుగా అగ్రగామిగా నిలుపుతనాని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని 46,64 డివిజన్లలో 3కోట్ల, 21లక్షల రూపాయలతో ఫుట్ పాత్, వ్యాయామ పరికరాలు, సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజ్ అభివృద్ధి పనుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి విషయం సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి అత్యధికంగా అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేసుకున్నామన్నారు. సీసీ రోడ్లు, ఇతర నిర్మాణాలు నాణ్యతగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, 64వ డివిజన్ అధ్యక్షులు వస్కుల శ్రీను, 46వ డివిజన్ అధ్యక్షులు దువ్వ శ్రీకాంత్, మెట్టుగుట్ట దేవస్థానం చైర్మెన్ పైడిపాల రఘుచందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story