తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

by Kodari Anjali |

గాయత్రినగర్​ డివిజన్​లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
X

దిశ, కూకట్​పల్లి: గాయత్రినగర్​ డివిజన్​లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గాయత్రినగర్​ డివిజన్​ పరిధిలోని పర్వత్​నగర్​, గాయత్రినగర్​ కాలనీలలో 53.50 లక్షల వ్యయంతో చేపడుతున్న తాగునీటి పైప్​లైప్​ పనులకు ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ పదేళ్ల కాలంలో అల్లాపూర్ డివిజన్​లో వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిధులు కొరత లేకుండా అభివృద్ధికి సహకరించారని గుర్తు చేశారు. ఒకప్పుడు వర్షం వస్తే అల్లాపూర్​ డివిజన్​ పరిధిలో కాలనీలు వరద ముంపు సమస్యతో ఇబ్బంది పడేవారని అన్నారు.

ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును...

డివిజన్​ పరిధిలోని అన్ని కాలనీలలో డ్రైనేజి, తాగునీటి పైప్​లైన్​ వ్యవస్థతో పాటు సీసీ రోడ్డు పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. గతంలో నిధులు కెటాయించి శంకుస్థాన చేసిన పనుల ఇప్పటికి పెండింగ్​లో ఉన్నాయని, పనులు పూర్తి చేద్దామంటే కాంగ్రెస్​ ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. బీఆర్​ఎస్​ హయాంలో జరిగిన అభివృద్దే తప్ప కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పనులు జరగడం లేదని అన్నారు. డివిజన్​లో కొనసాగుతున్న ఎస్​ఐఆర్​ ప్రక్రియను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. బిఎల్ఎ, బిఎల్ఓలు ప్రజల వద్దకు వెళ్లి వారికి అవగాహన కల్పిస్తూ ఎస్​ఐఆర్​ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి సమయాన్ని కెటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బీఆర్ఎస్​ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్​చార్జి గజ్జెల నగేష్​, మాజీ కార్పోరేటర్​ సబీహ బేగం, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మొహ్మద్​ గౌసుద్దీన్, జాహెద్​ షరీఫ్​ బాబా, లింగాల ఐలయ్య, నూర్, మొయిజ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story