- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మిక సంఘాల బలోపేతంలో కీలక పాత్ర: బండారు దత్తాత్రేయ
భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మికుల సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర ఆర్థికాభివృద్ధి ,బ్రిక్స్ దేశాల మధ్య కార్మిక సంఘాల సహకారాన్ని బలోపేతం చేయడంలో విశిష్టమైన పాత్ర పోషిస్తోందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

దిశ, రాంనగర్: భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మికుల సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర ఆర్థికాభివృద్ధి ,బ్రిక్స్ దేశాల మధ్య కార్మిక సంఘాల సహకారాన్ని బలోపేతం చేయడంలో విశిష్టమైన పాత్ర పోషిస్తోందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష దేశంగా వ్యవహరిస్తున్న సందర్భంగా, 2026 జూలై 14 నుండి 16 వరకు హైదరాబాద్‌లో జరగనున్న బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ ఫోరం సమ్మిట్ ఏర్పాట్లలో భాగంగా తేంగడి భవన్, భారతీయ మజ్దూర్ సంఘ్ (బి ఎం ఎస్) రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ సచివాలయాన్ని శుక్రవారం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ ఫోరం సమ్మిట్–2026 చైర్మన్ సుంకరి మల్లేశం మాట్లాడుతూ,.. ఈ సమ్మిట్ ప్రపంచ కార్మిక రంగానికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించేందుకు ఒక విశిష్ట వేదికగా నిలుస్తుందని తెలిపారు. భవిష్యత్ లో ఉద్యోగాలు, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరివర్తన, వృత్తి భద్రత, కార్మికుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయని తెలిపారు.
బీఎంఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద కేంద్ర కార్మిక సంఘమైన భారతీయ మజ్దూర్ సంఘ్ సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమములో ఐఎన్‌టీయూసీ అఖిల భారత ఉపాధ్యక్షులు సత్యజిత్ రెడ్డి , హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్ , బీఎంఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. రామిరెడ్డి, బీఎంఎస్ తెలంగాణ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి శ్రీ రామ్ మోహన్ రావు, ప్రముఖులు, వివిధ జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.






