బికినీ వేసుకుంటే తప్పేంటీ? ఆగ్రహం వ్యక్తం చేసిన మాళవికా మోహనన్

by Muthe.Rajitha |   (  Updated:2026-07-03 15:56:43  IST  )

తన బికినీ ఫోటోలపై విమర్శలు చేయడంపై మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

బికినీ వేసుకుంటే తప్పేంటీ? ఆగ్రహం వ్యక్తం చేసిన మాళవికా మోహనన్
X

దిశ, వెబ్ డెస్క్ : తన బికినీ ఫోటోలపై విమర్శలు చేయడంపై మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇటీవల బీచ్ లో బికినీలో హాట్ హాట్ అందాలతో కనువిందు చేసిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకోగా అవి కాస్త వైరల్ అవడంతోపాటు, ఇలాంటి బట్టలు వేసుకుంటూ మన సంస్కృతిని నాశనం చేస్తున్నారంటూ కామెంట్స్ చేసారు. అయితే ఈ విమర్శలకు ధీటుగా బదులిచ్చింది మాళవిక. "బికినీ ధరించడంలో తప్పేం ఉంది? విదేశాల్లో స్విమ్ సూట్ ధరించడం చాలా సాధారణం. మన సంస్కృతి, సంప్రదాయాలను ఎలా గౌరవించాలో, హద్దులు దాటకుండా ఉండాలో మాకు బాగా తెలుసు. ముందు మీ హద్దుల్లో మీరు ఉండండి. ఎవరినీ అంత తేలికగా విమర్శించకండి" అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది ఈ కేరళ కుట్టి. కాగా తమిళ, మలయాళీ సినిమాలతో బిజీగా ఉన్న మాళవికా షూటింగ్ గ్యాప్ దొరకడంతో స్నేహితులతో కలిసి మాల్దీవ్స్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది.

డీప్ ఫేక్ ఫొటోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన ప్రీతి జింతా

Next Story