AP : అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

by Naga Rani Yarlagadda |

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

AP : అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రేపు (శనివారం) అల్లూరి, ఏలూరు జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి - మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్లు, హోర్డింగులు, పురాతన భవనాలు, కరెంటు స్తంభాల వద్ద నిలబడవద్దని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

జులై 8 వరకూ..

మరోవైపు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలతో పాటు.. తెలంగాణలో జులై 8వ తేదీ వరకూ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Next Story