- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తిత్వ హననంపై పవన్ కల్యాణ్ సీరియస్.. గవర్నర్‌తో భేటీ
లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: లోక్‌భవన్(LokhBhavan)లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్(Governor Abdul Nazir)తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిణామాలపై ఇరువురి మధ్య కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు చేస్తున్న వ్యక్తిత్వ హననం, అసత్య ప్రచారాల తీరును ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి పవన్ కల్యాణ్ తీసుకెళ్లారు. సమాజంలో అతి ధోరణులు పెరిగిపోతుండంపై గవర్నర్‌కు వివరించారు. దుష్ప్రచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం తరఫున, చట్టపరంగా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారనే విషయాలను గవర్నర్‌కు పవన్ కల్యాణ్ వివరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తేనే ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయవచ్చని గవర్నర్‌కు ఈ భేటీలో పవన్ కల్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది.
విపరీత దోరణుపై ఫోకస్
కాగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీత దోరణులు ఎక్కువయ్యాయి. నచ్చకపోతే ఇష్టమొచ్చిన రీతిలో పోస్టులో పెడుతున్నారు. నోటికి వచ్చిన బూతులు తిడుతున్నారు. అయితే ఈ అతి పోకడపై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. కఠినంగా శిక్షిస్తామని అధికారికంగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇందులో భాగంగానే గవర్నర్‌తో భేటీ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై వివరించినట్లు సమాచారం.






