- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ (టి) గ్రామంలో గీసా విజయ, తిప్పా రాములు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

దిశ, టేకుమట్ల : భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ (టి) గ్రామంలో గీసా విజయ, తిప్పా రాములు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గురువారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన గృహాన్ని ప్రారంభించి, కుటుంబ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, గృహ నిర్మాణ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, మహేందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






