ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-02 11:00:23  IST  )

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), వివిధ కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఈ మేరకు చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల డిమాండ్‌పై సానుకూలంగా స్పందించిన కూటమి సర్కార్, వారి పదవీ విరమణ వయస్సును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది.

అయితే, గతంలో సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచినప్పటికీ, కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సొసైటీల పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఆ బెనిఫిట్ వర్తించలేదు. దీంతో ఈ విషయంలో పలు ఉద్యోగ సంఘాలు నిరంతరం ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందజేస్తూ.. తమనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ సీఎం చంద్రబాబు (CM Chandrababu) రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), వివిధ కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు ఫైలుపై సంతకం చేశారు. తాజా పరిణామంతో వేలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

Next Story