- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు.. కీలక పరిణామం
హైదరాబాద్ లో ఏసీబీ సోదాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో అధికారులు డైరీని స్వాధీనం చేసుకున్నారు. డైరీలో 15 మంది బినామీల పేర్లను భీంరెడ్డి రాసినట్టు గుర్తించారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో ఏసీబీ సోదాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో అధికారులు డైరీని స్వాధీనం చేసుకున్నారు. డైరీలో 15 మంది బినామీల పేర్లను భీంరెడ్డి రాసినట్టు గుర్తించారు. ఇప్పటి వరకు తనిఖీలలో రూ.200 కోట్లను అధికారులు గుర్తించారు. 16 ప్రాంతాల్లో భీంరెడ్డికి ఆస్తులు ఉన్నట్టు నిర్దారించారు. అంతేకాకుండా ఇంట్లో కేజీ బంగారం, రూ.40 లక్షలను గుర్తించి వాటిని సీజ్ చేశారు. మరో రెండు రోజుల పాటు ఈ సోదాలు జరగనున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే భీంరెడ్డి 1995లో ఎస్సైగా పోలీస్ శాఖలో విధుల్లో చేరారు. అధిక కాలం పాటు ఆయన హైదరాబాద్ లో విధులు నిర్వహించారు. ఆ తరవాత సీఐగా ప్రమోషన్ పొంది రాయదుర్గం, వనస్థలిపురం, చిక్కడపల్లి తదితర పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించారు. డీఎస్పీగా ప్రమోషన్ అందుకున్న తరవాత పటాన్ చెరు డివిజన్ లో పనిచేశారు. ప్రస్తుతం సీఐడీ డీఎస్పీగా ఆయన పనిచేస్తున్నారు. కాగా గతంలో అనేక వివాదాస్పద విషయాల్లో తలదూర్చడం వల్ల భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక నేడు ఉదయం నుండి ఏసీబీ సోదాలు నిర్వహిస్తుండగా ఆయన ఆస్తుల చిట్టా బయటపడుతోంది.






