- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం సాధించి తీరుతాం
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం (కేవీ) ఏర్పాటు కోసం గత ఎనిమిది నెలలుగా నిరంతర కృషి చేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం (కేవీ) ఏర్పాటు కోసం గత ఎనిమిది నెలలుగా నిరంతర కృషి చేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థల కేటాయింపులో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, అయితే పూర్తి వివరాలు తెలియకుండా కొందరు విమర్శలు చేస్తున్నారని అన్నారు. వాలాంతరి (Voluntary) సంస్థ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ (అటానమస్) అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడంతో శాస్త్రవేత్తల శిక్షణ కేంద్రంగా ఉన్న స్థల కేటాయింపులో కొంత ఆలస్యం జరిగిందని వివరించారు. కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత స్థలం కేటాయించాలంటే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తప్పనిసరని, గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక నిర్వహణ కోసం పాత ఎస్పీ కార్యాలయ భవనాన్ని కేవీ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి బృందం పరిశీలించి ఆమోదించిందని చెప్పారు. అలాగే శాశ్వత భవన నిర్మాణం కోసం చల్గల్‌లో రూ.50 కోట్ల విలువైన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ అడ్వాన్స్ పొసెషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. అదనంగా చల్గల్‌లో ఏడు ఎకరాల విస్తీర్ణంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు గజంగి నందయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, మాజీ టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కో-ఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.






