సీఎం విజయ్‌గా టైటిల్ కార్డ్.. జననాయగన్ కొత్త అప్డేట్‌తో ఫ్యాన్స్‌లో ఉత్సాహం

by Chukka Sudharani |   (  Updated:2026-07-02 16:40:21  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టేముందు నటించిన చివరి సినిమా ‘జననాయగన్’.

సీఎం విజయ్‌గా టైటిల్ కార్డ్.. జననాయగన్ కొత్త అప్డేట్‌తో ఫ్యాన్స్‌లో ఉత్సాహం
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టేముందు నటించిన చివరి సినిమా ‘జననాయగన్’. దీంతో సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ చిత్ర నిర్మాతలు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మధ్య తలెత్తిన కొన్ని వివాదాలు, సమస్యల కారణంగా సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా చివరి సెన్సార్ ముగించుకున్నట్లు తెలుస్తుంది. 9 మంది సభ్యులతో కూడిన సెన్సార్ బోర్డు జూన్ 30న సినిమాను చూసి, 'A' సర్టిఫికేట్ జారీ చెయ్యడం కోసం చాలా మ్యూట్‌లు, కట్‌లు సూచించింది. ముఖ్యంగా ప్రియమణి పాత్ర పేరు మార్చాల్సి ఉందని తెలిపింది.

ఇక ఈ సెన్సార్ సర్టిఫికేట్ ఫైనల్ అయితే.. డిస్ట్రిబ్యూటర్లు జులై 23న విడుదల చేయాలని డిమాండ్ చేస్తుండగా, ఓటీటీ సంస్థలు జులై 16న విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై నిర్మాణ సంస్థ తుది నిర్ణయం తీసుకుని త్వరలోనే అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. అయితే.. ఇందులో ఇంకో స్పెషల్ ఏంటంటే ‘జననాయగన్’ సినిమాలో తళపతి విజయ్‌కు బదులుగా సీఎంవిజయ్ టైటిల్ కార్డ్ పెట్టబోతున్నారని కొన్ని పోస్టులు వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు ముఖ్య పాత్రల్లో నటస్తున్నారు.

Next Story