- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్ రిలీజ్
భారత్ తో జరిగే రెండు టెస్టుల షెడ్యూల్ ను తాజాగా రిలీజ్ చేసింది శ్రీలంక క్రికెట్ బోర్డు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లీగ్ పూర్తయిన తర్వాత భారత జట్టు ఫుల్ బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ ఫినిష్ చేసిన భారత్, మొన్నటికి మొన్న ఐర్లాండ్ తో తలపడింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ ఆడుతోంది. ఇలాంటి క్రమంలో భారత్, శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ షెడ్యూల్ కూడా తాజాగా రిలీజ్ అయింది. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత నేరుగా శ్రీలంక టూర్ వెళ్లనుంది భారత్.
భారత్ తో జరిగే రెండు టెస్టుల షెడ్యూల్ ను తాజాగా రిలీజ్ చేసింది శ్రీలంక క్రికెట్ బోర్డు. తొలి టెస్ట్ గాలే లో ఆగస్టు 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కొనసాగనుంది. రెండు టెస్ట్ కొలంబోలో ఆగస్టు 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరుగుతుంది. ఉదయం 10 గంటలకు ఈ సిరీస్ లోని మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్ లో భారత్ కు ఈ సిరీస్ చాలా కీలకం కానుంది.






