- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ న్యూస్: ఎలక్ట్రికల్ బస్సులు బంద్
రాష్ట్రంలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఎలక్ట్రికల్ బస్సుల అగ్నిప్రమాదాల నేపథ్యంలో TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఎలక్ట్రికల్ బస్సుల అగ్నిప్రమాదాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూట్లలో నడుస్తున్న జేబీఎం (JBM) సంస్థకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు ప్రకటించారు. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం (NEBP) కింద పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్డెక్కిన ఈ జేబీఎం బస్సుల్లో వరుసగా హై వోల్టేజీ బ్యాటరీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు సాంకేతిక నిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్ట్యా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.
గత జూన్ నెలలో కేవలం వారం రోజుల వ్యవధిలోనే కరీంనగర్ డిపో పరిధిలో రెండు వేర్వేరు జేబీఎం ఎలక్ట్రికల్ బస్సుల్లో బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించాయి. దీంతో బస్సుల తయారీ సంస్థ ప్రతినిధులు, సాంకేతిక బృందాలు వచ్చి ప్రతీ బస్సులోని బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS), థర్మల్ రక్షణ వ్యవస్థలపై పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇచ్చే వరకు ఈ బస్సులు షెడ్లకే పరిమితం కానున్నాయి.






