మరికల్ మండలంలో ఇద్దరు వివాహిత మహిళలు అదృశ్యం

by Ratna Kumari |   (  Updated:2026-07-02 16:42:57  IST  )

మరికల్ మండలంలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వివాహిత మహిళలు అదృశ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరికల్ మండలంలో ఇద్దరు వివాహిత మహిళలు అదృశ్యం
X

దిశ, మరికల్ : మరికల్ మండలంలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వివాహిత మహిళలు అదృశ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని తీలేరు గ్రామానికి చెందిన మౌనిక అనే వివాహిత బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, తెలిసిన ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త శీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో కన్మనూర్ గ్రామానికి చెందిన శివాని మరికల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.

Next Story