- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్ధాపూర్‌లో ఎకోటౌన్‌కు గ్రీన్ సిగ్నల్
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ప్రతిపాదిత ఎకో-టౌన్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

దిశ, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ప్రతిపాదిత ఎకో-టౌన్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 86 ఎకరాల ప్రభుత్వ భూమిలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఆధునిక ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం అధికారికంగా ధృవీకరిస్తూ గురువారం జీవో నంబర్ 641ను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం, జపాన్‌లోని కిటాక్యూషూ నగరం మధ్య కుదిరిన సహకార ఒప్పందం మేరకు ఈ ఎకో-టౌన్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు.
సర్క్యులర్ ఎకానమీ, నెట్-జీరో లక్ష్యాల సాధన దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్టు కోసం టీజీఐఐసీకి చెందిన 86 ఎకరాల భూమిని జీహెచ్‌ఎంసీకి ఉచితంగా బదిలీ చేయగా, హెచ్ఐఎంఎస్ డబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో ఆధునిక వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే హైదరాబాద్ మహానగర ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు తోడ్పాటుతో పాటు పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.






