నటుడు జయకృష్ణను కలిసిన నరసరావుపేట కృష్ణ అభిమానులు

by Vemula.Srinu Prasad |

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం “శ్రీనివాస మంగాపురం” ఈ నెల 30వ తేదీన విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్‌లోని సారధి స్టూడియోస్‌లో ఘట్టమనేని అభిమానుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ..

నటుడు జయకృష్ణను కలిసిన నరసరావుపేట కృష్ణ అభిమానులు
X

దిశ, నరసరావుపేట: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం “శ్రీనివాస మంగాపురం” ఈ నెల 30వ తేదీన విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్‌లోని సారధి స్టూడియోస్‌లో ఘట్టమనేని అభిమానుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో ఘట్టమనేని జయకృష్ణ మాట్లాడుతూ, తన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ను ప్రేక్షకులు, అభిమానులు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల్లో నటించే అవకాశాలు రావాలంటే అభిమానుల ప్రేమ, ఆశీస్సులు, సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తన తాత సూపర్ స్టార్ కృష్ణ, తండ్రి రమేష్ బాబును స్మరించుకున్న జయకృష్ణ, తన బాబాయి యూనివర్సల్ స్టార్ మహేష్ బాబు ప్రోత్సాహం, ఆశీస్సులు ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటాయని తెలిపారు.అనంతరం నరసరావుపేటకు చెందిన సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు హీరో ఘట్టమనేని జయకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన తొలి చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హీరో కృష్ణ సీనియర్ అభిమాన సంఘ నాయకులు జి. జితేంద్రకుమార్, డి. రాంబాబు, ఎం.డి. ఖాదర్ గోరి, నరసరావుపేట కృష్ణ–మహేష్ బాబు అభిమానుల సంఘం పట్టణ అధ్యక్షుడు ఎం.డి. ఫారూఖ్ బాబు, ఎస్.కె. అబ్దుల్ సలాం, ఎం.డి. పర్వేజ్ చిష్తి, బి. కొండలరావు, పి. వెంకటరావు, జి. కోటేశ్వరరావు, ఛాయాగ్రాహకుడు చిన్ని కృష్ణ, ఎస్.కె. నబీబాజీ తదితరులు పాల్గొన్నారు.

Next Story